: కేసీఆర్ ను కలిసిన అమితాబ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఎన్నార్ అవార్డు అందుకునేందుకు హైదరాబాదు వచ్చిన 'బిగ్ బీ' సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ అమితాబ్ ను సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారి హైదరాబాదు వచ్చిన సందర్భంగా ఆయన, తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం, ఎన్నికల్లో ఘనవిజయం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వంటి విషయాల్లో కేసీఆర్ ను అమితాబ్ అభినందించారు.