: ఎంపీ గారూ, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి: కేశినేని నానితో బాబు
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఏపీ సచివాలయంలో సమావేశమయ్యారు. రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఓ బహిరంగ సభలో ఎంపీ నాని విజయవాడ అభివృద్ధి, అధికారుల తీరు, సమన్వయ లోపంపై విమర్శలు గుప్పించారు. బాబు దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేశినేని నానిని ఆదేశించారు. దీంతో, ఆయన జరిగిన ఘటనపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా, ఏవైనా సమస్యలుంటే పార్టీ అధిష్ఠానంతో చెప్పుకోవాలని, విభేదాలు, మనస్పర్థలను బహిరంగంగా వ్యక్తం చేసుకుంటే వివాదాలు పెరుగుతాయే తప్ప పరిష్కారం కావని సీఎం సూచించినట్టు సమాచారం. ఇకపై ఏదైనా సమస్య తలెత్తితే తనతో చెప్పుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చినట్టు, జరిగిన దానిపై మందలించినట్టు తెలుస్తోంది.