: 'భారతరత్న'కు ధ్యాన్ చంద్ అర్హుడు: మిల్కా సింగ్


దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'కు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ అర్హుడని లెజండరీ అథ్లెట్ మిల్కా సింగ్ పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి, దివంగత స్వాతంత్య్ర పోరాట యోధుడు, విద్యావేత్త పండిట్ మదన్ మోహన్ మాలవ్యకు కేంద్రం 'భారతరత్న' ప్రకటించడాన్ని స్వాగతించారు. "ఈ గొప్ప గౌరవం దక్కినందుకు వాజ్ పేయికి నా శుభాకాంక్షలు. అంతేగాక, దేశానికి పలు రకాలుగా సేవలందించిన మాలవ్యకు మరణానంతరం ఈ గుర్తింపు లభించినందుకు చాలా సంతోషిస్తున్నా" అని మిల్కా పేర్కొన్నారు. కాగా, ఒలింపిక్స్ లో భారత్ కు మూడు బంగారు పతకాలు సాధించిపెట్టడంతోపాటు, తన అద్భుతమైన ఆట ద్వారా దేశానికి మహోన్నతమైన సేవలందించిన ధ్యాన్ చంద్ కు కూడా ఈ గౌరవం దక్కితే చూడాలనుందని చెప్పారు.

  • Loading...

More Telugu News