: 'చంద్రన్న సంక్రాంతి' పేరిట ఉచితంగా నిత్యావసర వస్తువులు: మంత్రి సునీత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'చంద్రన్న సంక్రాంతి' పేరిట పేదలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో కోటి 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మీడియాకు చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.220 విలువచేసే ఆరు సరుకులు పంపిణీ చేయనున్నామన్నారు. అందులో కిలో గోధుమపిండి, కిలో పామాయిల్, అరకిలో శనగలు, అరకిలో బెల్లం, వంద గ్రాముల నెయ్యి, అరకిలో కందిపప్పు ఉంటాయని సునీత వివరించారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.287 కోట్లు వెచ్చించనున్నట్టు మంత్రి తెలిపారు.