: మోక్షజ్ఞను కృష్ణానదిలో విసిరేసింది కన్న తండ్రే: తల్లి విమల ఆరోపణ


విజయవాడ సమీపంలో కనకదుర్గమ్మ వారిధి వద్ద కలకలం సృష్టించిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తన కుమారుడిని భర్త భాస్కరరావు, ఆయన కుటుంబ సభ్యులు కలసి చంపి ఉంటారని మోక్షజ్ఞ తల్లి విమల ప్రియ ఆరోపించారు. తన భర్తకు జాతకాల పిచ్చి ఉండటమే ఇందుకు కారణమని ఆమె అంటున్నారు. మోక్షజ్ఞ పుట్టుకతో తండ్రికి ప్రాణగండం ఉందని జాతకంలో చెప్పారని, ఈ నేపథ్యంలో, తన భర్తే చంపి ఉండొచ్చని విమల వాపోయారు. ఈ కేసులో మోక్షజ్ఞను బాబాయి గోడపాటి హరిహరణ్ కృష్ణానదిలోకి విసిరేసినట్టు భావించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న విమల, భాస్కరరావు తమ కొడుకును ఆరు నెలల నుంచి తెనాలిలో ఉంటున్న తాతయ్య, నాయనమ్మ వద్ద ఉంచారు.

  • Loading...

More Telugu News