: సరిహద్దులో కొనసాగుతున్న పాక్ ఉల్లంఘనలు


పాకిస్థాన్ తీరు మార్చుకోవడంలేదు! జమ్మూ, కథువా జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద తాజాగా కాల్పులకు తెగబడింది. గత నాలుగు రోజుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది నాలుగోసారి. పాక్ బలగాలు జమ్మూలోని ఆర్నియా సబ్ సెక్టార్లో విక్రమన్ పోస్టుపై తేలికపాటి ఆయుధాలతో దాడికి దిగాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. అటు, కథువా జిల్లాలో హీరానగర్ సెక్టార్లోని జబోవల్ పోస్టుపైనా కాల్పులు జరిపారు. ఈ రెండు ఘటనల్లో ఎవరూ గాయపడలేదని ఆ అధికారి చెప్పారు. పాక్ సైన్యం కాల్పులకు భారత సరిహద్దు భద్రత దళం దీటుగా స్పందించింది. సమర్థంగా కాల్పులను తిప్పికొట్టింది.

  • Loading...

More Telugu News