: 'బాబీ బాబా' అవతారమెత్తిన మెదక్ విద్యార్థి... అమ్మాయిల చేతుల్లో నిప్పులు!


మెదక్ జిల్లా నరసాపూర్ మండలం పెద్ద చింతకుంట సమీపంలోని సీతారాం తండాలోని అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వినోద్ అనే విద్యార్థి ఇటీవల తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. దొంగలను పట్టుకోవడానికి, అక్కడే 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సహాయం కోరాడు. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో... ఆ టెన్త్ క్లాస్ విద్యార్థి కాస్తా వారానికోసారి 'బాబీ బాబా'గా అవతారం ఎత్తుతుంటాడు. సెల్ ఫోన్ వ్యవహారం కూడా అతని వద్దకు వెళ్లింది. దీంతో, అనుమానితులను తన వద్దకు తీసుకురమ్మన్నాడు. వినోద్ ఐదుగురు విద్యార్థినుల పేర్లు చెప్పగా, వారి చేతులపై నిప్పులు పోస్తానని, ఎవరి చేతులు కాలితే వాళ్లే దొంగలని చెప్పి అగ్నిపరీక్ష పెట్టాడు. ఐదుగురికీ చేతులు కాలాయి. వాళ్లను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News