: సల్మాన్ కు వెంకీ జన్మదిన శుభాకాంక్షలు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 49వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేశ్ కూడా సల్మాన్ కు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. అంతేగాకుండా, సల్మాన్, తాను స్కూటర్లపై కూర్చుని ఉన్న ఓ ఫొటోను కూడా పోస్టు చేశారు. సన్నిహిత మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వెంకీ పెట్టిన ఈ పోస్టుకు వేలల్లో లైకులు రావడం విశేషం.