: జమ్మూ కాశ్మీర్ లో ప్రాంతీయ పార్టీలను అణచివేయవద్దని బీజేపీకి ఆజాద్ సూచన


జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఎలాంటి రాజకీయాలకు పాల్పడరాదని, ప్రాంతీయ పార్టీలపై ప్రతాపాన్ని చూపవద్దని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ బీజేపీకి సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, "బీజేపీ తన విధానక్రమంలో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను అణచివేస్తోంది. తన విద్యుక్త ధర్మంలో సున్నితత్వం పాటించడం లేదు" అని ఆజాద్ ఆరోపించారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పీడీపీకి మద్దతు ఇస్తామని ప్రతిపాదన చేశామన్నారు. ప్రస్తుతం బంతి వారి కోర్టులోనే ఉందని చెప్పారు. ముఫ్తీ మహ్మద్ సయీద్ అనుభవజ్ఞుడైన రాజకీయనేత అని, తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News