: వరల్డ్ కప్ ఆరంభం నాటికి క్లార్క్ కోలుకోవడం కష్టమే!
భారత్ తో టెస్టు సిరీస్ సందర్భంగా కండరాల గాయానికి గురైన రెగ్యులర్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వరల్డ్ కప్ ఆరంభం నాటికి కోలుకోకపోవచ్చని తెలుస్తోంది. గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో మరికొన్ని నెలల పాటు క్లార్క్ క్రికెట్ కు దూరంగా ఉండకతప్పదు. అయితే, వరల్డ్ కప్ తదుపరి దశల్లో క్లార్క్ బరిలో దిగే అవకాశాలున్నాయి. దీనిపై క్లార్క్ మాట్లాడుతూ, ఇంగ్లండ్ జట్టుతో ఫిబ్రవరి 14న జరిగే ఆరంభ మ్యాచ్ నాటికి తాను కోలుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అయితే, వరల్డ్ కప్ లో అధిక శాతం మ్యాచ్ లకు అందుబాటులో ఉంటానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. సెలక్టర్లు వరల్డ్ కప్ లో ఆడే అవకాశం కల్పిస్తారనే అనుకుంటున్నట్టు చెప్పాడు. కాగా, క్లార్క్ గైర్హాజరీలో డేవిడ్ బెయిలీ, స్టీవెన్ స్మిత్ లలో ఒకరు వరల్డ్ కప్ ఆరంభంలో ఆసీస్ జట్టుకు నాయకత్వం వహిస్తారు. ప్రస్తుతం భారత్ తో టెస్టు సిరీస్ లో వరుస సెంచరీలు బాదుతుండడంతో స్మిత్ పేరు కూడా రేసులోకి వచ్చింది.