: రాష్ట్ర ఎంపీలపై వరాలు కురిపించిన టీఎస్ ప్రభుత్వం


తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులపై టీఎస్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రతి ఎంపీకి రాష్ట్ర ఎమ్మెల్యేల తరహాలో భద్రత, వాహన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, వంట తదితర అవసరాలకోసం నెలకు రూ. 50 వేలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఎంపీలు కూడా తమ నియోజకవర్గాల్లో విస్తారంగా తిరిగి ప్రజా సమస్యలను పరిశీలిస్తారనే కోణంలో వారికి ఈ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయమై గతంలో కొందరు ఎంపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి ఈ మేరకు విన్నవించారు. దానిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ వరాలు కురిపించారు.

  • Loading...

More Telugu News