: నేతాజీకీ భారతరత్న... స్వీకరించేవారు లేక వెనక్కుతగ్గిన మోదీ ప్రభుత్వం!
మాలవ్యా, వాజ్ పేయిలతో పాటు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కూ భారతరత్న ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిందట. అయితే ఆ మహోన్నత పురస్కారాన్ని నేతాజీ తరపున స్వీకరించే వారు లేక కేంద్రం వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. 1945 ఆగస్ట్ లో అదృశ్యమైన ఆయన మరణించాడనటానికి సాక్ష్యాలు లేవు. అలాగని బతికే ఉన్నాడని చెప్పేందుకూ నిదర్శనం లేదు. నేతాజీ ఎక్కడో జీవించే ఉన్నారని, ఏదో ఒక రోజు తిరిగి వస్తారని నేతాజీ కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్ముతున్నారు. బతికున్న వ్యక్తి పురస్కారాన్ని ఆయన తరపున ఎలా స్వీకరిస్తామని వారు ప్రశ్నించడమే ప్రభుత్వం వెనక్కు తగ్గటానికి కారణమని సమాచారం.