: కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించాలనుకున్న ఏరియల్ సర్వే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. రేపు ఏరియల్ సర్వేను నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. సర్వే నిర్వహించిన అనంతరం ఈ రెండు జిల్లాల అభివృద్ధిపై అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. ఏరియల్ సర్వే ద్వారా... హైదరాబాద్ నగరంలోని రోడ్లు, ట్రాఫిక్ కూడళ్లతో పాటు రెండు జిల్లాల పరిధిలోని అటవీ భూములను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.