: చట్టపరమైన లొసుగులవల్లే లఖ్వీకి బెయిల్: పాక్ కోర్టు


ముంబయి పేలుళ్ల కేసులో చట్టపరమైన లొసుగులు ఉండటం వల్లే పేలుళ్ల ప్రధాన సూత్రధారి ఉగ్రవాది జాకి-ఉర్-రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ వచ్చేలా చేసిందని పాకిస్థాన్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తన తీర్పులో పేర్కొంది. బలహీనమైన సాక్ష్యాలు, ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న బలహీన సెక్షన్లు, ఎప్పటికీ ముగింపు లేని విచారణ, సాక్ష్యం అతనికి అనుకూలంగా ఉండటం వంటి పలు కారణాల వల్లే బెయిల్ ఇవ్వాల్సి వచ్చిందని తీర్పులో వివరించింది. ఈ నెల 17న పాక్ కోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేయడం, దానిపై భారత్ సహా పలువురు వ్యతిరేకించడం తెలిసిందే. అయితే, తీర్పు కాపీ అందకపోవడంతో బెయిల్ పై పాక్ ప్రభుత్వం అప్పీలులో జాప్యం జరిగింది.

  • Loading...

More Telugu News