: 9 డక్ ఔట్లు... 4 పరుగులకు ఆలౌట్!
అది సచిన్ టెండూల్కర్ సహా ఎంతో మంది క్రికెటర్లు శిక్షణ పొందిన ముంబై లోని శివాజీ పార్క్ స్టేడియం. ముంబై లోని స్కూల్స్ మధ్య అండర్-16 విభాగం ఫైనల్ మ్యాచ్ లో ఒక టీం క్రికెట్ చరిత్రలో అత్యంత ఘోరంగా విఫలం కాగా, మరో టీం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అంధేరీ లోని రాజ్ హన్స్ విద్యాలయ, గోరేగాన్ లోని యశోధామ్ హై స్కూల్ మధ్య పోటీ జరిగింది. యశోధామ్ కు చెందిన గౌరంగ్ సచార్ 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 6 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్టు మిగతా వికెట్లను 4 పరుగులు చేసి కోల్పోయింది. రాజ్ హన్స్ కు చెందిన 9 మంది ఆటగాళ్ళు ఎటువంటి పరుగులూ చేయకుండా పెవిలియన్ చేరారు. ముంబై స్కూల్ క్రికెట్ చరిత్రలో ఇది ఓ చెత్త రికార్డుగా మిగలనుంది.