: తొలి వికెట్ కోల్పోయిన భారత్


ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి ఉసూరుమనిపించాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హారిస్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ 27 పరుగులతో ఆడుతున్నాడు. ఛటేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 530 పరుగుల భారీ స్కోరు సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News