: సబర్మతి జైలులో సంస్కృతం నేర్చుకుంటున్న ముస్లిం, క్రైస్తవ ఖైదీలు


గుజరాత్ లోని సబర్మతి సెంట్రల్ జైలులో 15 మంది ముస్లిం ఖైదీలు, మరికొందరు క్రిస్టియన్ ఖైదీలు సంస్కృతం నేర్చుకుంటున్నారు. ఈ ప్రాచీన భాషను నేర్చుకునేందుకు వారే స్వచ్ఛందంగా ముందుకురావడం విశేషం. అహ్మదాబాద్ కు చెందిన సంస్కృత భారతి అనే స్వచ్ఛంద సంస్థ ఖైదీలకు 10 రోజుల క్రాష్ కోర్సు నిర్వహిస్తోంది. ఈ సంస్థ సమన్వయకర్త సుకుమార్ త్రివేది మాట్లాడుతూ, తాము శ్లోకాలు నేర్పించడం లేదని, సంస్కృతాన్ని ఓ భాషగానే బోధిస్తున్నామని తెలిపారు. ఖైదీలు సులువుగా ఈ భాషను నేర్చుకుంటున్నారని, కాగితం, కలం లేకుండా బోధన సాగుతోందని చెప్పారు. కొన్ని వస్తువులు చూపి సంస్కృతంలో వాటిని ఏమంటారో నేర్పిస్తున్నామని త్రివేది వివరించారు. సంస్కృతం త్వరగా మాట్లాడేందుకు ఈ విధానం సాయపడుతుందని అన్నారు. సంస్కృతం నేర్చుకునేందుకు ముస్లిం, క్రైస్తవ ఖైదీలు సమ ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News