: వాజ్ పేయిని కీర్తించిన రష్యా అధ్యక్షుడు


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న ప్రకటించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. వాజ్ పేయికి అభినందనలు తెలిపారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. అపార విజ్ఞానం ఆయన సొంతమని కీర్తించారు. డిసెంబర్ 25న వాజ్ పేయి జన్మదినం సందర్భంగా ఈ మేరకు తన సందేశం వెలువరించారు. భారత ఆధునిక చరిత్ర వాజ్ పేయి పేరుతో ముడిపడి ఉందని పుతిన్ తెలిపారు. ప్రతిభావంతుడైన కవిగా కూడా ఆయన గౌరవం అందుకున్నారని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో వాజ్ పేయి, పుతిన్ భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News