: 32 పోస్టులకు 25 వేల దరఖాస్తులు... అర్ధాంతరంగా ఆగిన హోంగార్డుల ఎంపిక
ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ హోంగార్డుల ఎంపిక ప్రక్రియ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వాయిదా పడింది. దీంతో ఆగ్రహానికి గురైన వందలాది మంది నిరుద్యోగులు విజయవాడ మున్సిపల్ మైదానం వద్ద ధర్నాకు దిగారు. అధికారులు ఎంపిక ప్రక్రియను వాయిదా వేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తమ కాల్ లెటర్ లపై ఫోన్ నెంబర్ లు ఉన్నాయని, కనీసం ఒక ఎస్ఎంఎస్ అయినా ఇవ్వొచ్చు కదా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వీరి ఆందోళనతో విజయవాడ-బందరు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.