: చైనా పెన్ డ్రైవ్ లపై భారీగా సుంకం?
చైనా నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న పెన్ డ్రైవ్ లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దిగుమతి సుంకాన్ని విధించి సాధ్యమైనంత మేర దిగుమతులను అడ్డుకోవాలని భావిస్తోంది. ఒక్కో పెన్ డ్రైవ్ పై గరిష్ఠంగా 3.12 డాలర్ల వరకు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలనే భావనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. పెన్ డ్రైవ్ లను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు అండగా నిలవాలనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.