: మత మార్పిడి నిషేధ చట్టం రాజ్యాంగ విరుద్ధం: మైనారిటీ కమిషన్
మత మార్పిడులను అడ్డుకునే 'మత మార్పిడి నిషేధ చట్టం'పై మైనారిటీ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో మత మార్పిడులను నిషేధిస్తూ చట్టం చేస్తే... అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని తెలిపింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలోని ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేసింది. ప్రతి పౌరుడు తనకు ఇష్టం వచ్చిన మతంలో కొనసాగవచ్చని... మత ప్రచారం చేసుకోవచ్చని రాజ్యాంగం సూచిస్తోందని తెలిపింది. మత మార్పిడి నిషేధిత చట్టం మత స్వేచ్ఛను హరించడమే అని మైనారిటీ కమిషన్ స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొంతమంది తమ వ్యాఖ్యలతో మైనారిటీలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడింది.