: ప్రజల కోసం పాలేరులా పని చేస్తానన్న తుమ్మల
ఇటీవలే సైకిల్ దిగి కారెక్కి, నేరుగా మంత్రి సీటులో కూర్చున్న తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన శాఖపై దృష్టి సారించారు. జిల్లా కేంద్రాల్లో నాలుగు వరుసల రహదారులు, మండల కేంద్రాల్లో రెండు వరుసల రహదారులను నిర్మిస్తామని చెప్పారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల రుణం తీర్చుకుంటానని... ప్రజల అభివృద్ధి కోసం పాలేరులా పని చేస్తానని అన్నారు.