: ఐక్యరాజ్యసమితికి విరాళాన్ని ప్రకటించిన భారత్


ఐక్యరాజ్య సమితికి భారత ప్రభుత్వం విరాళాన్ని ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే, 2004లో సంభవించిన సునామీ దాదాపు రెండున్నర లక్షల మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటన జరిగి సరిగ్గా దశాబ్ద కాలం అయింది. అయినా, ఆనాటి హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. ఈ ఘటన అనంతరం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి? అనే అంశంపై ప్రపంచ దేశాల్లో ఆలోచన మొదలయింది. దీని కోసం ఐక్యరాజ్య సమితి కూడా ఒక సహాయనిధిని ఏర్పాటు చేసింది. ఈ సహాయ నిధికి భారత్ ఒక మిలియన్ అమెరికా డాలర్ల విరాళాన్ని ప్రకటించింది.

  • Loading...

More Telugu News