: స్టీవెన్ స్మిత్ సెంచరీ... ఆస్ట్రేలియా 356/6
భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అద్భుత బ్యాటింగ్ తో మరో సెంచరీ సాధించాడు. స్మిత్ కు అండగా నిలిచిన హాడిన్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం స్మిత్ (120), మిచెల్ జాన్సన్ (13) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 356 పరుగులు.