: 166 ఏపీకి, 128 తెలంగాణకి... పూర్తైన విభజన


అఖిల భారత సర్వీసుల విభజన జాబితా విడుదల అయింది. జాబితాను కేంద్రం వెబ్ సైట్లో పెట్టింది. సీనియారిటీ కేటగిరీల వారిగా విభజనను పూర్తి చేసినట్టు అధికారులు జాబితాలో పేర్కొన్నారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే పరిష్కరించేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. 45 రోజుల్లో పూర్తిస్థాయి జాబితాను ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 166 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది. తెలంగాణకు 128 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 119 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించగా, తెలంగాణకు 92 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. విభజించిన ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తక్షణం విధుల్లో చేరాలని వెబ్ సైట్లో పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే తెలపాలని 15 రోజుల్లో పరిష్కారిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News