: అమీర్ ఖాన్ కు అరుదైన గౌరవం
బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సృష్టించుకున్న హీరో అమీర్ ఖాన్. ఇప్పుడు అమీర్ ఖాన్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా 'అత్యంత ప్రభావశీలురైన 100 మంది' వ్యక్తుల జాబితాలో అమీర్ ఖాన్ కూ చోటు కల్పించింది. గతేడాది బుల్లితెరపై 'సత్యమేవ జయతే' కార్యక్రమంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ను 2013 ఏడాదికి గాను 'మార్గదర్శి' అని టైమ్ మ్యాగజైన్ అభివర్ణించింది. కాగా, టైమ్ జాబితాలో ఆర్ధిక మంత్రి చిదంబరం, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా, కొత్త పోప్ ఫ్రాన్సిస్, పాక్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్, మయన్మార్ రాజకీయ ఉద్యమకారిణి ఆంగ్ సాన్ సూకీ, హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ లు కూడా ఉన్నారు.