: పోలీసులకు దమ్ముంటే అష్రాఫ్ మిర్ పై కేసు పెట్టండి: ఒమర్


పోలీసులకు దమ్ముంటే అష్రాఫ్ మిర్ పై కేసు పెట్టాలని జమ్మూకాశ్మీర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సవాలు విసిరారు. సోనావర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి, సీఎం ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించిన అష్రాఫ్ మిర్ మద్దతుదారులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఏకే 47తో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఆయన పోలీసులకు సవాలు విసిరారు. తాము తమకు మద్దతిస్తామని లేఖ రాసినట్టు పీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన స్పష్టం చేశారు. పీడీపీకి అధికారికంగా మద్దతిస్తున్నట్టు లేఖ రాయలేదని ఆయన వివరించారు. పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే అప్పుడు మద్దతిస్తామని మాత్రమే తాము చెప్పినట్టు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News