: ఆటిజం (పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపం) చిన్నారులకు గూగుల్ గ్లాస్ యాప్స్
ఆటిజం (పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపం)తో బాధపడే చిన్నారులకు గూగుల్ గ్లాస్ లో ప్రత్యేక యాప్స్ ను అందుబాటులోకి తేనుంది. అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల కోసం గూగుల్ గ్లాస్ లో ప్రత్యేక యాప్స్ తో పాటు కొన్ని ప్రత్యేక హార్డ్ వేర్ పరికరాలను తయారు చేస్తుంది. ఆటిజంతో బాధపడే చిన్నారులు సోషల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, తదితర అంశాలు నేర్చుకునేందుకు, అలాగే వారి గురించి సంరక్షకులకు సరైన నివేదిక ఇచ్చేందుకు ఈ యాప్స్ ఉపకరిస్తాయి. కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ కు చెందిన బ్రెయిన్ పవర్, అనే స్టార్టప్ కంపెనీనీ నెడ్ టి సహిన్ అనే న్యూరో సైంటిస్ట్ స్థాపించారు. ఆ సంస్థ ఆటిజంతో బాధపడే చిన్నారులకు సహాయం చేసేందుకు విశేషమైన కృషి చేస్తోంది.