: సంజయ్ దత్ సెలవు వివాదం... విచారణకు సర్కారు ఆదేశం
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు నుంచి సెలవు పొందడంపై మహారాష్ట్రలో వివాదం రేగుతోంది. దీంతో మహారాష్ట్ర సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంజూబాబాకి సరైన కారణాలతోనే సెలవు మంజూరైందా? అన్న అంశంపై విచారణ జరపాల్సిందిగా జైళ్ల శాఖను ఆదేశించింది. సంజయ్ దత్ జైలు నుంచి విరివిగా సెలవు పొందుతున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, అక్రమ ఆయుధాల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్, 14 రోజుల సెలవు నిమిత్తం ఎరవాడ జైలు నుంచి బుధవారం విడుదలైన విషయం తెలిసిందే.