: మంత్రి యనమలపై రూ. 5 కోట్ల పరువునష్టం దావా
ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడులపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా దాఖలైంది. ప్రియంక హేచరీస్ యజమాని చంద్రమౌళి వీరిపై దావా వేశారు. అనధికారికంగా ఉన్న హేచరీస్ నుంచి తాను డబ్బులు వసూలు చేస్తున్నానంటూ యనమల సోదరులు తనను విమర్శించారని... దీంతో, తన పరువుకు భంగం వాటిల్లిందని చంద్రమౌళి తెలిపారు. పరువు నష్టం కింద తనకు రూ. 5 కోట్లు చెల్లించాలని దావా వేశారు.