: రోశయ్యను క్షమాపణ కోరిన తెలంగాణ హోంమంత్రి నాయిని


తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అల్లుడిపై చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకుంటున్నట్టు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. రోశయ్య అల్లుడి విషయంలో చేసిన ఆరోపణలపై ఆయన క్షమాపణ కోరారు. మల్లెపల్లిలోని ఐటీఐకి చెందిన భూమిని రోశయ్య తన అల్లుడికి నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని నాయిని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను ఆరోపణలు చేసిన మాట వాస్తవమేనని, అయితే విచారణ అనంతరం ఈ వివాదంలో రోశయ్య అల్లుడికి సంబంధం లేదని తేలిందని చెప్పారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమి వెనక్కు తీసుకుంటామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News