: అప్పుడు షూటింగులు అడ్డుకుంటామన్నారు... ఇప్పడు రాయితీలు ఇస్తామంటున్నారు!
టీఆర్ఎస్ నేతల్లో, ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవితలో చాలా మార్పు వచ్చినట్టుంది. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో సినిమా షూటింగులను ఎక్కడికక్కడే తెలంగాణవాదులు అడ్డుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఆంధ్ర వాళ్ల షూటింగులను ఎట్టి పరిస్థితుల్లోను కొనసాగనివ్వమని సాక్షాత్తు కవిత ఎన్నోసార్లు చెప్పారు. అదేంటో కానీ, ఇప్పుడు కవిత పూర్తిగా మారిపోయినట్టున్నారు. హైదరాబాదును షూటింగ్ హబ్ గా మారుస్తామని... ఇక్కడ షూటింగ్ చేసుకునే వారికి రాయితీలు కూడా ఇస్తామని ఆమె చెప్పారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ తో కూడా మాట్లాడామని తెలిపారు. కొత్తగా నిర్మించాలనుకుంటున్న ఫిలిం సిటీ ఏర్పాటుపై కూడా కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.