: కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన ఆర్మీ చీఫ్


కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ కలిశారు. ఢిల్లీలో జరిగిన వీరి భేటీలో, అసోంలో బోడో ఉగ్రవాదుల ఊచకోతపై చర్చ జరిగింది. తాజా భద్రతా పరిస్థితులపై రాజ్ నాథ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం సుహాగ్ మాట్లాడుతూ, అసోంలో సైనిక దళాల ఆపరేషన్ ను సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కావడం వల్ల ఇంతకన్నా ఎక్కువ సమాచారాన్ని వెల్లడించలేనని తెలిపారు. అసోంలో బోడో ఉగ్రవాదులు జరిపిన ఊచకోతలో 80 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News