: ఎవరెస్ట్ శిఖరం ఎక్కనున్న హ్యూస్ బ్యాట్!


దురదృష్టవశాత్తూ క్రికెట్ బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ చివరిగా వాడిన బ్యాట్ ఎవరెస్టు శిఖరం చేరనుంది. హ్యూస్‌ కు నివాళిగా అతను వాడిన బ్యాటును ఎవరెస్టు శిఖరం మీద ఉంచుతామని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియాకు ఒక లేఖ అందింది. దీనిపై సానుకూలంగా స్పందించమని, హ్యూస్‌ బ్యాట్ ను శిఖరాగ్రానికి చేర్చేందుకు నేపాల్ క్రీడాకారులతో, పర్వతారోహకులతో చర్చలు జరుపుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ వ్యాలీ ఎడ్వర్డ్స్ తెలిపారు. వచ్చే సీజన్‌లో బ్యాట్ ను ఎవరెస్ట్ చేరుస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నేపాల్ క్రీడాకారులతో 63 ఓవర్ల మ్యాచ్ జరపాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఎడ్వర్డ్స్ తెలిపారు. కాగా, హ్యూస్ తన చివరి మ్యాచ్ లో 63 పరుగుల వద్ద ఉండగా అబాట్ వేసిన బంతి మెడ నరాలపై బలంగా తాకడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News