: రాష్ట్ర సరిహద్దుల్లో సీసీ కెమెరాలు: ఏపీ డీజీపీ
ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామని ఏపీ డీజీపీ జేవీ రాముడు అన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ రోజు తిరుపతిలోని తూర్పు పోలీస్ స్టేషన్ లో సెంట్రల్ పాయింట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రానున్న ఆరు నెలల్లోగా ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్లను పట్టుకుంటామని చెప్పారు. అత్యంత సున్నితమైన తిరుపతి నగరంలో భద్రతను పటిష్ఠం చేసే క్రమంలో, కమాండింగ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.