: దమ్ముంటే ఉపఎన్నికలకు రండి: కేసీఆర్ కు రేవంత్ సవాల్
ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ దమ్ముంటే వారి చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు జరిపించాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. నేటి మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశానికి చెందిన తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే కేసీఆర్ చర్యలు తీసుకొని తలసాని రాజీనామా ఆమోదం పొందేలా చూడాలని, ఆపై ఉపఎన్నికలకు వస్తే ఎవరి సత్తా ఎంతో తేలుతుందని ఆయన అన్నారు.