: ఏడు రోజులుగా మీరట్ దాటని ఆ రైలు


ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు రైళ్ల రాకపోకలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలిపే మరో ఘటన ఇది. ప్రతి రోజు అలహాబాద్ లో సాయంత్రం 5:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:50కి షహరాన్ పూర్ చేరే నౌచండి ఎక్స్ ప్రెస్ గత వారం రోజులుగా మీరట్ దాటడం లేదు. వాస్తవానికి మీరట్ కు ఉదయం 8:30కి రావాల్సిన రైలు దట్టమైన పొగమంచు కారణంగా రోజూ 6 నుంచి 8 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో నౌచండి ఎక్స్ ప్రెస్ ను మీరట్ నుంచి వెనక్కు పంపాల్సి వస్తోంది. మీరట్, షహరాన్ పూర్ ల మధ్య నిత్యమూ తిరుగుతుండే ఉద్యోగులు ఈ ట్రైన్ పైనే ఎక్కువ ఆధారపడి ఉంటారు. పొగమంచు కారణంగా మరుసటి రోజు రైలును రద్దు చేసేకన్నా మీరట్ నుంచి వెనక్కు పంపడం మేలని రైల్వే అధికారులు వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా ఈ రైలు సరైన సమయానికి వచ్చి మీరట్ ఉద్యోగులకు ఉపయోగపడాలంటే మరిన్ని రోజులు పట్టేలా ఉంది.

  • Loading...

More Telugu News