: పాక్ లో డ్రోన్ దాడులు... ఏడుగురు ఉగ్రవాదుల హతం


పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు నిలయమైన ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన డ్రోన్ లు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. పాక్ తాలిబన్ కమాండర్ ఖార్రీ ఇమ్రాన్ ను అంతమొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడులు కొనసాగాయని... అయితే, మృత్యువాత పడిన వారిలో ఇమ్రాన్ ఉన్నాడా? లేడా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News