: తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
తిరుమల వెంకన్న దర్శనానికి నేడు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి జనవరి 2 వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఈ ఉదయం ప్రకటించారు. అయితే ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రం పరిమిత సంఖ్యలో వీఐపీ దర్శనాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో చివరి వారం, నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ రద్దీ వారం రోజులకు పైగా కొనసాగే అవకాశాలున్నాయి.