: గంటాతో అయ్యన్నపాత్రుడు భేటీ: టీడీపీలో కొణతాల చేరికపై చర్చ


ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొద్దిసేపటి క్రితం విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను టీడీపీలోకి చేర్చుకునే విషయంపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. కొణతాల తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని గంటా శ్రీనివాసరావు నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అయ్యన్నపాత్రుడితో గంటా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల విశాఖ ఆర్డీఓ బదిలీ విషయంలో కత్తులు దూసుకున్న గంటా, అయ్యన్నలు తాజాగా కొణతాల విషయంలో ఒక్కతాటిపైకి రావడం విశేషం.

  • Loading...

More Telugu News