: బోడోలపై ముప్పేట డాడి: 'ఆపరేషన్ ఆలౌట్'కు సైన్యం సిద్ధం


అమాయకులైన ఆదివాసీలపై అకారణంగా విరుచుకుపడిన బోడో తీవ్రవాదులపై ముప్పేట దాడికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అసోం పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలు బోడోలపై దాడులు ముమ్మరం చేశారు. తాజాగా భారత సైన్యం కూడా బోడోలపై ఉక్కుపాదం మోపనుంది. ఆపరేషన్ ఆలౌట్ పేరిట సైన్యం చేపట్టనున్న ఏరివేత త్వరలోనే ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితం హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ భేటీ అయ్యారు. బోడోల నిర్మూలనకు రంగంలోకి దిగాలన్న రాజ్ నాథ్ ఆదేశం మేరకు త్వరలోనే ఆపరేషన్ ఆలౌట్ ను ప్రారంభించనున్నామని భేటీ అనంతరం ఆయన విలేకరులకు చెప్పారు.

  • Loading...

More Telugu News