: జార్ఖండ్ సీఎంగా రఘుబర్ దాస్ ఎంపిక
జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా రఘుబర్ దాస్ ఎంపికయ్యారు. కొద్దిసేపటి క్రితం భేటీ అయిన జార్ఖండ్ బీజేపీ శాసనసభా పక్షం ఆయన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఆయన జార్ఖండ్ కు తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. చత్తీస్ గఢ్ కు చెందిన రఘుబర్ దాస్ జార్ఖండ్ లోనే స్థిరపడ్డారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న ఆయన మొన్నటి ఎన్నికల్లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా సీఎం పీఠాన్నే అధిష్టించనున్నారు.