: మరోసారి వాయిదా పడ్డ వైజాగ్ స్టీల్ ఐపీవో


ప్రఖ్యాతి గాంచిన వైజాగ్ స్టీల్ ఐపీవో మరోసారి వాయిదా పడింది. హుదూద్ తుపాను నేపథ్యంలో, ప్లాంట్ పూర్తిగా దెబ్బ తినడంతో ఐపీవోను వాయిదా వేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే, 10 శాతం వాటాను రానున్న ఆర్థిక సంవత్సరంలో విక్రయించే అవకాశం ఉందని చెప్పారు. సంస్థకు చెందిన 48.89 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడం ద్వారా భారీ ఎత్తున నిధులు సేకరించాలని వైజాగ్ స్టీల్ భావిస్తోంది. ఇందులో 35 శాతం షేర్లను రీటైల్ ఇన్వెస్టర్లకు, 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోసం కేటాయించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News