: పోస్టల్ జీవిత బీమా పరిమితి పెంపు
పోస్టల్ జీవిత బీమా పరిమితిని రూ. 50 లక్షలకు పెంచారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 20 లక్షలుగా ఉంది. నిన్న, సుపరిపాలన దినోత్సవం (గుడ్ గవర్నెన్స్ డే) సందర్భంగా కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తం 21 పథకాలను గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా ఆయన ప్రకటించారు. దీనికితోడు, ఎంటీఎన్ఎల్ ప్రవేశపెట్టిన నెల రోజుల ఉచిత రెంటల్ బ్రాడ్ బ్యాండ్ పథకాన్ని కూడా ఆయన ప్రారంభించారు. జీవిత బీమా పరిమితి పెంపుతో ఎగువ మధ్యతరగతి ప్రజానీకానికి లబ్ధి చేకూరనుంది.