: పొగమంచులో ల్యాండ్ చేయడం ఆ పైలట్ కు తెలియదట... కోల్ కతాకు తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం


జెట్ ఎయిర్ వేస్ పైలట్లకు మాత్రమే కాదు, ఎయిర్ ఇండియా పైలట్లకు కూడా సరైన శిక్షణ లేదని తేలిపోయింది. 200 మంది ప్రయాణికులతో బుధవారం కోల్ కతా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ తిరిగి కోల్ కతాలోనే ల్యాండైంది. కారణమేంటంటే, పొగమంచుతో నిండిపోయిన ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ఎలా దింపాలో సదరు పైలట్ కు అర్థం కాలేదట. అంతే, ఎంచక్కా వచ్చిన దారినే తిరిగి వచ్చి కోల్ కతాలో ఆ విమానాన్ని దింపేశాడు. వివరాల్లోకెళితే... సాయంత్రం 5 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం రాత్రి 9 గంటల సమయంలో కోల్ కతా నుంచి ఢిల్లీ బయలుదేరింది. నిర్ణీత సమయంలోనే రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరింది. అయితే అప్పటికే పొగమంచుతో నిండిపోయిన ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని దింపే విషయంలో పైలట్ తడబడ్డాడు. 20 నిమిషాల పాటు ఢిల్లీ గగనతలం మీదే చక్కర్లు కొట్టాడు. ఇక లాభం లేదనుకుని తిరిగి కోల్ కతాకు విమానాన్ని మళ్లించాడు. రాత్రి 1.15 గంటలకు కోల్ కతా విమానాశ్రయంలో విమానాన్ని దించేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన ఎయిర్ ఇండియా అధికారులు ఎలాగోలా ప్రయాణికులకు సర్దిచెప్పి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News