: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు అయ్యప్ప భక్తుల మృతి


కడప జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట వద్ద డివైడర్ ను ఢీకొట్టిన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలుకు చెందిన వారు. అయ్యప్ప మాలలు ధరించిన వీరు శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News