: మరో రెండు ఆసిస్ వికెట్లు డౌన్...ఆస్ట్రేలియా స్కోరు 115/3
భారత్ తో మూడో టెస్టులో తొలి వికెట్ పడిన తర్వాత లంచ్ విరామం దాకా నిలకడగా బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా, లంచ్ తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న ఓపెనర్ క్రిస్ రోజర్స్ (57), షేన్ వాట్సన్ (52) ఒక్క ఓవర్ వ్యవధిలో పెవిలియన్ చేరారు. మొహ్మద్ షమీ బౌలింగ్ లో టీమిండియా కీపర్ ధోనీ చేతికి చిక్కిన రోజర్స్ వెనుదిరిగిన తర్వాత ఆరు బంతుల్లోనే అశ్విన్ బౌలింగ్ లో వాట్సన్ ఎల్బీగా ఔటయ్యాడు. 40 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్, షాన్ మార్ష్ క్రీజులో ఉన్నారు.