: నేడు టీ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, పార్టీ సన్నాహకాలపై ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ లో టీడీపీకి మంచి పట్టున్న సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ కు గతంలో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ నేపథ్యంలో ఈ దఫా ఎన్నికల్లోనూ సత్తా చాటే దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఆయన, పార్టీ తెలంగాణ ప్రాంత ముఖ్యులతో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News