: ఇంటర్నెట్ కాల్స్ పై అదనపు ఛార్జ్ ను పరిశీలించనున్న ప్రభుత్వం
ఎయిర్ టెల్ ప్రకటనను ప్రభుత్వం పరిశీలించనుంది. ఇంటర్నెట్ కాల్స్ పై అదనంగా ఛార్జ్ చేస్తామని ఎయిర్ టెల్ ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్ కాల్స్ పై అదనంగా వసూలు చేస్తామన్న అంశాలన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇంటర్నెట్ సేవలకు ధరలు వసూలు చేయడంలో భాగంగా స్కైప్, వెబర్ తదితర యాప్ ల ద్వారా ఉచితంగా కాల్స్ మాట్లాడుకునే సౌకర్యాన్ని ఎయిర్ టెల్ తొలగించింది. త్వరలో వీఓఐపీ కాల్స్ కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని ఎయిర్ టెల్ వెల్లడించింది.