: నాయిని కాన్వాయ్ ఢీకొంది
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ప్రయాణిస్తున్న నాయిని కాన్వాయ్ వాహన శ్రేణిలోని రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న టీఆర్ఎస్ నేత ముఠాగోపాల్ స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.